రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఇవాళ ప్రకటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. పరీక్ష ఫలితాలను వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి తెలిపారు.
Inter results: నేడు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల
15:49 July 22
ఇవాళ సాయంత్రం 4 గం.కు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు
ఈ వెబ్‌సైట్లలో ఫలితాలు..
- examsresults.ap.nic.in, bie.ap.gov.in
- results.bie.ap.gov.in, results.apcfss.in
ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మార్కులిలా..
ఇంటర్ రెండో ఏడాది విద్యార్థులు 2019లో పది, 2020లో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను రాశారు. ఈ రెండింటిని కలిపి రెండో ఏడాది మార్కులను ఖరారు చేయాలని ఛాయరతన్ కమిటీ నిర్ణయించింది. పదోతరగతి మార్కులకు 30శాతం, బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు ప్రథమ సంవత్సరంతో పాటు ఇటీవల నిర్వహించిన ప్రయోగ పరీక్షలతో కలిపి 70శాతం చొప్పున వెయిటేజీ తీసుకొని రెండో ఏడాదికి వంద శాతానికి మార్కులను ఇవ్వనున్నట్లు తెలిసింది. ఆర్ట్స్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ఉండనందున ఇంటర్ ప్రథమ సంవత్సరం మార్కులు, పదో తరగతి మార్కుల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ పరీక్షల విభాగాన్ని ఇంటర్ విద్యామండలి కోరింది.
ఇదీ చదవండి: CM Jagan alert on rains: భారీ వర్షాలు... అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు