రాష్ట్రంలో నరేగా పనులకు బిల్లులు చెల్లించకపోవటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2018 నుంచి 2019 వరకూ పెండింగ్ వివరాలను 2 వారాల్లోగా నివేదించాలని ఆదేశించింది. కేంద్రం నుంచి డబ్బులు రాలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పగా.. మరి ఆ తరువాతి ఏడాది నుంచి ఎలా వచ్చాయని హైకోర్టు ప్రశ్నించింది.
నరేగా పనులకు బిల్లులు చెల్లించకపోవటంపై హైకోర్టు ఆగ్రహం
రాష్ట్రంలో నరేగా పనులకు బిల్లులు చెల్లించకపోవడంపై హైక్టోర్టు అసహనం వ్యక్తం చేసింది. 2018 నుంచి 2019 వరకు పెండింగ్ వివరాలు నివేదించాలని ఆదేశించింది. సరైన సమాధానం ఇవ్వకపోతే సీఎస్‌ను హైకోర్టుకు పిలిపిస్తామన్న ధర్మాసనం హెచ్చరించింది.
ఐదు లక్షల రూపాయల బిల్లులను 20 శాతం తగ్గించి ఇస్తామని కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసి.. ఎందుకు ఇవ్వలేదని ధర్మాసనం ఆగ్రహించింది. రెండు వారాల్లోపు పూర్తిస్థాయి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. సరైన సమాధానం ఇవ్వకపోతే హైకోర్టుకు చీఫ్ సెక్రటరీని కోర్టుకు పిలిపిస్తామని హెచ్చరించింది. ఏడు లక్షల రూపాయల పనులకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. పూర్తిస్థాయి అఫిడవిట్ వెంటనే దాఖలు చేయాలని హైకోర్టు బెంచ్ ఆదేశించింది.
ఇదీ చదవండి: