ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP High Court: ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారికి వారం జైలుశిక్ష - Andhra Pradesh HC sends two IAS officers to jail

Andhra Pradesh high court sends two IAS officers to jail
Andhra Pradesh high court sends two IAS officers to jail

By

Published : Jun 22, 2021, 4:03 PM IST

Updated : Jun 23, 2021, 3:00 AM IST

15:57 June 22

ఉన్నత న్యాయస్థానం తీర్పును అమలు చేయలేదని..

కోర్టుధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారి , ప్రస్తుత పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ , అప్పటి ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది . వారికి తొలుత నాలుగు వారాల జైలు శిక్ష , రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది . వారిని కస్టడీలోకి తీసుకోవాలని స్పష్టంచేసింది . కోర్టు ఉత్తర్వుల అమలుకు మరో అవకాశం ఇవ్వాలని అధికారులు , వారి తరఫు న్యాయవాదులు అభ్యర్థించడంతో జైలు శిక్ష విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం ఉపసంహరించుకుంది . కోర్టు ఆదేశాల అమలు కోసం రెండు వారాల సమయం ఇస్తూ విచారణను వాయిదా వేసింది . హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు .

   ఉద్యానవన శాఖ విలేజ్ హార్టీకల్చర్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది . ఎంపిక ప్రక్రియ మధ్యలో ఉండగా .. నిబంధనలను మార్చడంతో అనర్హతలకు గురయ్యామని 36 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు . విచారణ జరిపిన న్యాయస్థానం .. నోటిఫికేషన్ సవరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి , పిటిషనర్లకు పోస్టుల భర్తీలో అవకాశం కల్పించాలంది . 2020 సెప్పెంబర్ 9 న ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది . ఆ ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో 36 మంది అభ్యర్థులు ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టుధిక్కరణ వ్యాజ్యం వేశారు . న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో తాజా విచారణకు ఇరువురు అధికారులు కోర్టుకు హాజరయ్యారు . ఉద్దేశపూర్వకంగా ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు న్యాయమూర్తి తొలత అధికారులకు జైలు శిక్ష విధించారు . మరో అవకాశం ఇవ్వాలని అధికారులు అభ్యర్థించడంతో జైలు శిక్ష విధింపు ఉత్తర్వులను ఉపసంహరించారు . రెండు వారాల సమయం ఇచ్చారు .

ఇదీ చదవండి

MLC THOTA: పోలీసులపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అసహనం..

Last Updated : Jun 23, 2021, 3:00 AM IST

ABOUT THE AUTHOR

...view details