మాజీమంత్రి అచ్చెన్నాయుడిని గుంటూరు రమేష్ ఆసుపత్రి నుంచి ఎన్నారై ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆయన్ను ఎన్నారైకు తరలించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు . ఈఎస్ఐ కేసులో అరెస్ట్ అయిన మాజీమంత్రి అనారోగ్యం కారణంగా హైకోర్టు ఆదేశాలతో గుంటూరు రమేష్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు.
ఇటీవల చేసిన కరోనా నిర్ధరణ పరీక్షలో పాజిటివ్‌గా తేలటంతో ఆసుపత్రి సిబ్బంది హైకోర్టుకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై రిపోర్ట్ పంపారు. ఆ నివేదిక ఆధారంగా అచ్చెన్నాయుడికి కరోనా చికిత్స అందించేందుకు ఎన్నారై ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది.