తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియమాకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వం జారీ చేసిన జీఓలను గతంలోనే హైకోర్టు సస్పెండ్ చేసిందని.. చట్టంలో సవరణ తీసుకువచ్చి త్వరలోనే ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనానికి ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. పిటిషనర్ తరపు న్యాయవాదులు యలమంజుల బాలాజీ, అశ్వినీ కుమార్ లు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 82 మందితో తితిదే పాలకమండలిని ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. జంబో క్యాబినెట్ ను తలపిస్తుందని వాదించారు. జీఓలను రద్దు చేయాలని పిటీషనర్ తరపు న్యాయవాదులు కోరారు. చట్ట సవరణకు సంబంధించిన వివరాలను సమర్పించేందుకు ప్రభుత్వ న్యాయవాది నాలుగు వారాలు సమయం కోరారు. తదుపరి కేసు విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది
తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియామకాలపై హైకోర్టు విచారణ.. 2 వారాలకు వాయిదా - తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియమాకాలపై హైకోర్టు విచారణ వార్తలు
తితిదే ప్రత్యేక ఆహ్వానితుల కేసుపై హైకోర్టు విచారణ జరిపింది. 82 మందితో తితిదే పాలకమండలిని ఎలా నియమిస్తారని పిటిషనర్ తరపు న్యాయవాదులు ప్రశ్నించారు. జంబో క్యాబినెట్‌ను తలపిస్తుందని వాదించారు. వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వ న్యాయవాది సమయం కోరగా.. విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.
![తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియామకాలపై హైకోర్టు విచారణ.. 2 వారాలకు వాయిదా TTD board members case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14245288-217-14245288-1642761080454.jpg)
TTD board members case
Last Updated : Jan 21, 2022, 6:28 PM IST