ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Highcourt: మధ్యంతర ఉత్తర్వులన్నీ జులై 15 వరకు పొడగింపు! - aop courts

హైకోర్టు, దిగువ న్యాయస్థానాలు / ట్రైబ్యున్నళ్లు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులన్నింటినీ బేషరతుగా మరోసారి పొడగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. జులై 15 వరకు వాటిని పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది.

andhra pradesh high court
హైకోర్టు

By

Published : Jun 30, 2021, 7:19 AM IST

హైకోర్టు, దిగువ న్యాయస్థానాలు / ట్రైబ్యునళ్లు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులన్నింటినీ బేషరతుగా మరోసారి పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. జూలై 15 వరకు వాటిని పొడిగించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

న్యాయస్థానాలు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను కరోనా వ్యాప్తి నేపథ్యంలో బేషరతుగా జూన్ 30 వరకు పొడగిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 28న హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ వ్యాజ్యంపై హైకోర్టులో మరోసారి విచారణకు రాగా జూలై 15 వరకు మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details