Vidhya deevena: విద్యాదీవెనపై ప్రభుత్వ రివ్యూ పిటిషన్ కొట్టివేత - cm jagan
12:24 December 13
Vidhya deevena: ప్రభుత్వ రివ్యూ పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు తుది తీర్పు
Vidhya deevena: జగనన్న విద్యాదీవెన పథకానికి సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులు గతంలో హైకోర్టు కొట్టివేయగా.. ప్రభుత్వం ఆ తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. మరోవైపు ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రైవేట్ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి.
ప్రైవేట్ యాజమాన్యాల తరఫున న్యాయవాదులు విజయ్, వెంకటరమణ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ కొంగర విజయలక్ష్మి ధర్మాసనం ప్రభుత్వ రివ్యూ పిటిషన్ కొట్టివేస్తూ తుది తీర్పు వెలువరించింది.
ఇదీ చదవండి: