AP Government Transfers Three IPS Officers: రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ విపత్తు నిర్వహణ, అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న మాదిరెడ్డి ప్రతాప్‌ను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. ఏపీ స్టేట్ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఎన్. సంజయ్‌ని రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇక పోలీసు శిక్షణ విభాగం ఐజీ పి. వెంకట్రామిరెడ్డిని ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
IPS: ముగ్గురు ఐపీఎస్ అధికారులు బదిలీ - IPS
Transfers Three IPS Officers: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ శాఖలకు చెందిన ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ విపత్తు నిర్వహణ, అగ్నిమాపకశాఖ.. సాధారణ పరిపాలన శాఖ, ఏపీ స్టేట్ పోలీసు హౌసింగ్ కార్పోరేషన్‌లోని వివిధ విభాగాలకు చెందిన అధికారులకు స్థానచలనం కల్పించింది. మెుత్తం ముగ్గురిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
ఐపీఎస్ అధికారులను బదిలీ