రాష్ట్ర యువత విదేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు త్వరలో ‘అంతర్జాతీయ వలస కేంద్రం’(ఐఎంసీ) ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (ఓంక్యాప్) బోర్డు సమావేశానికి ఆన్‌లైన్‌లో మంత్రి హాజరయ్యారు. విదేశాలకు వెళ్లాలనే ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతకు ఐఎంసీ ద్వారా సమాచారమిస్తామని, జిల్లా ఉద్యోగ కల్పన కేంద్రాలు, నైపుణ్య కేంద్రాలు, ఐటీఐల్లో వీటిని ఏర్పాటు చేయనున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ కేంద్రాల ద్వారా కెరీర్ కౌన్సెలింగ్, విదేశాలకు వెళ్లే ముందు అవసరమయ్యే శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఓంక్యాప్ ద్వారా జర్మనీ, గల్ఫ్, యూరప్ దేశాల్లో 3వేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
విదేశాల్లో ఉద్యోగాలకు ‘అంతర్జాతీయ వలస కేంద్రం’ - విదేశాల్లో ఏపీ ఉద్యోగులు
రాష్ట్ర యువత విదేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు ‘అంతర్జాతీయ వలస కేంద్రం’(ఐఎంసీ) ఏర్పాటు చేస్తామని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఓంక్యాప్ బోర్డు సమావేశంలో మంత్రి ఈ వివరాలు వెల్లడించారు.
మంత్రి గౌతమ్‌రెడ్డి