ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మద్య నిషేధం ఊసే లేదు.. కొత్త మద్యం విధానంలో కొత్త షాపులు - ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ

Liquor Policy: మద్యపాన నిషేధం మాట మార్చి.. మద్యపాన నియంత్రణ పాట పాడుతున్న వైకాపా సర్కార్‌ ఇప్పుడు దానికీ కట్టుబడేలా కనిపించడంలేదు. దశలవారీగా కొన్ని మద్యం దుకాణాలు ఎత్తేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఈసారీ ఆ ఊసెత్తలేదు. గతేడాది ఉన్నన్ని మద్యం దుకాణాలు మరో ఏడాది కొనసాగుతాయంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పైగా పర్యాటక కేంద్రాల్లో లిక్కర్‌ అవుట్‌లెట్లకు కొత్తగా అనుమతిచ్చింది. పాతవి కొనసాగిస్తూ అదనంగా అనుమతివ్వడం మద్యపాన నిషేధం కిందకు వస్తుందా, నియంత్రణ కిందకు వస్తుందో మందుబాబులకూ అంతుచిక్కడం లేదు.

Liquor Policy
మద్యం పాలసీ

By

Published : Oct 1, 2022, 8:01 AM IST

Updated : Oct 1, 2022, 11:42 AM IST

Ap Govt New Liquor Policy: పూర్తిగా లేకుండా చేస్తాం.. దశలవారిగా నిషేధిస్తాం ఇదీ మద్యపాన నిషేధంపై జగన్ చెప్పింది. 2015లో మద్యపానాన్ని నిషేధిస్తామని స్పష్టంగా చెప్పిన జగన్‌ 2019లో అధికారంలోకి వచ్చాక నియంత్రణగా మాటమార్చేశారు. పోనీ దానికైనా కట్టుబడతరా అంటే.. ఎక్కడా లేని మన మద్యం బ్రాండ్లకే తెలియాలి. ఎందుకంటే దశలవారీ మద్య నిషేధం హామీ దశలవారీగా గాలికిపోతోంది. 2020 తర్వాత ఒక్కటంటే ఒక్క మద్యం దుకాణాన్నీ తగ్గించలేదు. ఈసారైనా మాట ప్రకారం తగ్గిస్తారనుకుంటే అదీలేదు. శుక్రవారం 2022-23కి సంబంధించి ఖరారు చేసిన నూతన మద్యం విధానంలోనూ ఎక్కడా తగ్గింపు ప్రస్తావన లేదు. 2023 సెప్టెంబరు 30 వరకూ పాత వాటన్నింటినీ యథాతథంగా కొనసాగిస్తామని ఉత్తర్వులు ఇచ్చింది. వీటి ప్రకారం మరో ఏడాది కూడా ఇప్పుడున్న దుకాణాలు తగ్గవని తేలిపోయింది. వైకాపా అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలు ఉండేవి. 2020 మే నాటికి వాటి సంఖ్యను 2,934కు తగ్గించింది. ఆ తర్వాత నుంచి తాజాగా ప్రకటించిన విధానంలోనూ మద్యం దుకాణాల తగ్గింపు ఊసేలేదు. జగన్‌ హామీ ఇచ్చినట్లు, వైకాపా ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్లు 2024 నాటికి స్టార్‌ హోటళ్లకే మద్యం పరిమితం కావాలంటే ఏటా కనీసం 33 శాతం చొప్పున మద్యం దుకాణాలను తగ్గించుకుంటూ పోవాలి. వైకాపా అధికారంలోకి వచ్చి ఇప్పటికే మూడున్నరేళ్లయింది. ఆ లెక్కన చూసినాఇప్పటికే దుకాణాలు నామమాత్రంగా ఉండాలి.

ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల సంఖ్యే యథాతథంగా కొనసాగుతుందని ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం.. పర్యాటక కేంద్రాల్లో లిక్కర్‌ అవుట్‌లెట్లు, వాకిన్‌ షాప్‌ల ఏర్పాటుకు తాజా విధానంలో అనుమతిచ్చింది. అంటే మరిన్ని మద్యం దుకాణాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. బెవరేజస్‌ కార్పొరేషన్‌ అనుమతితో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ వీటిని ఏర్పాటు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. మద్యనిషేధమే ప్రభుత్వ లక్ష్యమైతే కొత్తగా వీటి ఏర్పాటుకు ఎందుకు అనుమతిస్తున్నట్లో అర్థం కావడంలేదు. ఇదంతా ఒకఎత్తైతే మద్యం దుకాణాల్లో పారదర్శకత పాటించడం లేదు. అన్ని మద్యం దుకాణాల్లోనూ ఎలక్ట్రానిక్, డిజిటల్‌ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెడతామని 2021-22 మద్యం విధానంలో ప్రభుత్వం పేర్కొంది. కానీ, అమలు చేయలేదు. తాజాగా ఖరారైన 2022-23 విధానంలో అసలు డిజిటల్‌ చెల్లింపుల ప్రస్తావనే లేదు. అంటే పారదర్శకతకు పాతరేసినట్లేనా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

నూతన మద్యం పాలసీ

ఇవీ చదవండి:

Last Updated : Oct 1, 2022, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details