మత్స్యకార బోట్లలో వినియోగించే హైస్పీడ్ డీజిల్‌కు అమ్మకపు పన్ను మినహాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తీరం వెంబడి ఉన్న 92 హైస్పీడ్ డీజిల్ ఆయిల్ అవుట్ లెట్లను ప్రభుత్వం నోటిఫై చేసింది. సముద్రంలో చేపల వేటకు వినియోగించే మెకనైజ్డ్ బోట్లు, మోటారు బోట్లలో వినియోగించే హైస్పీడ్ డీజిల్ ఆయిల్‌పై అమ్మకపుపన్నును మినహాయిస్తూ ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా తీరప్రాంతాల్లోని 92 హైస్పీడ్ డీజిల్ విక్రయించే అవుట్ లెట్లలో అమ్మకపు పన్ను మినహాయిస్తూ ఆదేశాలు ఇచ్చారు. చేపల వేటకు వినియోగించే మెకనైజ్డ్, మోటారు బోట్లలో వినియోగించే హైస్పీడ్ డీజిల్ ఆయిల్ విక్రయాలకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది. ఆరు నెలల పాటు ఈ మినహాయింపు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.