Cinema Tickets Issue: సినిమా టికెట్ల వ్యవహారంపై కొత్త కమిటీ నియామకం - ap latest news
11:24 December 28
సినిమా టికెట్ ధరల పరిశీలనకు కమిటీ నియామకం
New Committee on Cinema Tickets: సినిమా టికెట్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. దీనిలో సభ్యులుగా రెవెన్యూ, ఆర్థిక, పురపాలక శాఖల ముఖ్యకార్యదర్శులు.. సమాచార శాఖ కమిషనర్, న్యాయశాఖ కార్యదర్శి, కృష్ణా జిల్లా జేసీతో పాటు థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, సినీ గోయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఉంటారు. సినిమా థియేటర్ల వర్గీకరణ, ధరలను కమిటీ నిర్ధారించనుంది. టికెట్ల ధరలపై ఈ కమిటీ పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.
ఇదీ చదవండి: