ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇప్పటివరకూ రాష్ట్రంలో.. ఎంతమందికి టీకాలు అందాయంటే...!

కరోనా నివారణలో భాగంగా ఒక వైపు కర్ఫ్యూ విధిస్తూనే, వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా కొనసాగిస్తున్నామని సీఎస్​ అధిత్యనాథ్​ తెలిపారు. కరోనా నివారణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1, 48, 64, 205 మందికి టీకాలు వేశామని తెలిపారు.

AP cs adithyanath on corona test in ap
AP cs adithyanath on corona test in ap

By

Published : Jun 30, 2021, 6:43 AM IST

ఏపీలో ఇప్పటి వరకూ 2.16 కోట్ల కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టీపీసీఆర్ ద్వారా 1.47 కోట్ల పరీక్షలు, ర్యాపిడ్ యాంటీజెన్ ద్వారా 68 లక్షల పైచిలుకు పరీక్షలు నిర్వహించినట్టుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 18,75,622 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే.. 18,16,930 మంది వ్యాధి నుంచి కొలుకున్నారని తెలిపారు. కరోనా కారణంగా ఇంత వరకూ 12,566 మంది మృతి చెందారని సీఎస్ అదిత్యనాథ్ చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1,48,64,205 మందికి టీకాలు వేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. కాగా 1,19,54,827 మందికి ఒక డోసు. 29,09,378 మందికి రెండు డోసులు వేశామని తెలిపారు.

జర్వ పీడితుల గుర్తింపునకు చేపట్టిన ఇంటింటి సర్వేలో 1,42,55,516 కుటుంబాల నుంచి నమూనాల సేకరించామని సీఎస్​ చెప్పారు. కరోనా నివారణలో భాగంగా ఒక వైపు కర్ఫ్యూ విధిస్తూనే, వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా కొనసాగిస్తున్నామన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా మరింత వేగవంతంగా రాష్ట్రంలో కరోనా నివారణ సాధ్యమవుతుందని సీఎస్​ ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు.

ఇదీ చదవండి:

DISHA APP: 'దిశ' యాప్ ఉంటే..అన్నయ్య తోడున్నట్లే: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details