తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఎన్నికలప్పుడు దోస్తీ కట్టే ముఖ్యమంత్రులు జల వివాదాలప్పుడు మౌనం వహించడం రాజకీయ డ్రామా లేనంటు విమర్శించారు.
సజ్జల నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అధికార పార్టీ నేతలు ముంపు గ్రామాలను పరిశీలించక పోవడం దారుణమన్నారు. ఫొటోలు దిగడానికే పోలవరం ప్రాజెక్టును సందర్శించారని ఆరోపించారు.