CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 771 కరోనా కేసులు.. 8 మరణాలు - ఏపీలో కరోనా కేసులు తాజా వార్తలు
![CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 771 కరోనా కేసులు.. 8 మరణాలు AP corona cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13198936-605-13198936-1632827316394.jpg)
AP corona cases
16:22 September 28
ఏపీ కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 45,592మంది నమూనాలు పరీక్షించగా 771 కొత్త కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,333 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11,912 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్ వల్ల చిత్తూరు జిల్లాలో ఇద్దరు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, కడప జిల్లాలో ఒకరు, కృష్ణాలో ఒకరు మరణించారు.
ఇదీ చదవండి:
AP RAINS: అల్పపీడనంగా వాయుగుండం!
Last Updated : Sep 28, 2021, 5:02 PM IST