ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan on OTS : ఆ విషయంలో బలవంతం చేయబోం : సీఎం జగన్‌

CM Jagan on OTS : జగనన్న సంపూర్ణ గృహ హక్కు కింద చేపట్టిన వన్ టైం సెటిల్ మెంట్(ఓటీఎస్) పూర్తిగా స్వచ్ఛందమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ముందుకు వచ్చిన వారికే రిజిస్ట్రేషన్లు చేస్తామన్నారు. పేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని తీసుకువచ్చామని, వీటి వల్ల పేదలకు వారి ఇళ్లపై సంపూర్ణ హక్కులు లభిస్తాయన్నారు. పేదలపై పదివేల కోట్ల రూపాయల భారాన్ని తొలగిస్తున్నామన్న సీఎం.. ఈ పథకం ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఆ విషయంలో బలవంతం చేయబోం : సీఎం జగన్‌
CM Jagan on OTS

By

Published : Dec 8, 2021, 1:58 PM IST

Updated : Dec 8, 2021, 4:36 PM IST

CM Jagan on OTS : జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం, గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. సమావేశంలో గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఓటీఎస్‌ పథకం, గృహ నిర్మాణంపై సీఎం చర్చించారు. ఓటీఎస్‌ పథకం పురోగతిపై వివరాలను సీఎంకు అధికారులు అందించారు. ఓటీఎస్‌పై అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజలకు ఏ రకంగా మంచి జరుగుతుందో చెబుతూ, వారికి అవగాహన కలిగించాలన్నారు. వన్ టైం రిజిస్ట్రేషన్ పూర్తి స్వచ్ఛందమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌ జరుగుతుందని, 10వేల కోట్ల రూపాయల భారాన్ని పేదలపై తొలగిస్తున్నామన్నారు. వారి రుణాలు మాఫీ చేస్తూనే, ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నామన్నారు. దీనివల్ల ఇళ్లపై లబ్ధిదారులకు సంపూర్ణ హక్కులు వస్తాయని, వీటిపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు.

CM Jagan Comments on TDP: ఓటీఎస్ పథకం అమలు కాకుండా చాలామంది చాలారకాలుగా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. గతంలో వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదలనూ గత సర్కార్ కనీసం పరిశీలించలేదన్నారు. సుమారు 43 వేలమంది గత ప్రభుత్వ హయాంలో అసలు, వడ్డీకూడా కట్టారని.. ఇవాళ మాట్లాడుతున్నవారు అప్పుడు ఎందుకు కట్టించున్నారని సీఎం ప్రశ్నించారు. గతంలో అసలు, వడ్డీ కడితే బీ–ఫారం పట్టా మాత్రమే ఇచ్చేవారని గుర్తు చేశారు. ఇప్పుడు ఓటీఎస్‌ పథకం ద్వారా అన్నిరకాలుగా సంపూర్ణహక్కులు ఇస్తున్నామని సీఎం తెలిపారు. అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చని, అమ్ముకునే హక్కుకూడా ఉంటుందన్నారు. పేదలకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నామని , ఆ అవకాశాలను వాడుకోవాలా? లేదా? అనేది వారి ఇష్టమన్నారు. ఓటీఎస్‌ పథకం పూర్తిగా స్వచ్ఛందమని సీఎం తెలిపారు. డిసెంబర్‌ 21 నుంచే రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇవ్వడం ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రుణాలు చెల్లించిన 43 వేల మందికి కూడా రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని, వారికీ సంపూర్ణ హక్కులు కల్పిస్తూ మేలు చేస్తామన్నారు.

భవిష్యత్తులో గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ పనులు జరుగుతాయి సీఎం తెలిపారు. ఓటీఎస్ కోసం 22–ఎ తొలగింపునకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని అధికారులు తెలిపారు. ఓటీఎస్‌ వినియోగించుకున్నవారికి స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, యూజర్‌ ఫీజులను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని అధికారులు వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ పనులు చేస్తున్నామని తెలిపారు. ఓటీఎస్‌ వినియోగించుకున్న వారికి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్, ఫీల్డ్‌స్కెచ్, లోన్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌లు ఇస్తున్నామన్నారు.

CM Jagan Review on Housing Scheme: గృహనిర్మాణంపైనా సమీక్షించిన సీఎం పలు ఆదేశాలు జారీ చేశారు. పేదలకు ఇళ్లు , గృహనిర్మాణంపై ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని, కోర్టు కేసులు పరిష్కారం అయ్యాయని తెలిపారు. వర్షాలు ఆగిన దృష్ట్యా .. ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణంలో నాణ్యత బాగుండాలని, దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. సొంతంగా ఇళ్లు కట్టుకునేవారికి నిర్మాణంలో మంచి సలహాలు ఇచ్చేలా చూడాలన్నారు. ఇళ్లు నాణ్యంగా కట్టుకోవడం సహా ఇంటి నిర్మాణ ఖర్చులను తగ్గించేలా అన్ని రకాల విధానాలనూ అవలంభించాలన్నారు. నిర్మాణానికి అవసరమయ్యే ఇటుకలు ఆయా కాలనీలకు సమీపంలోనే తయారయ్యేలా చూడాలని సీఎం సూచించారు. లేబర్‌ క్యాంపు, సిమెంటు గోదాములు వంటివి లేఅవుట్లలో ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయన్నారు.

ఓటీఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రజలకు ఏరకంగా మంచి జరుగుతుందో చెప్పాలి. ఓటీఎస్‌ అన్నది పూర్తి స్వచ్ఛందం. క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌ జరుగుతుంది. రూ.10 వేల కోట్ల భారాన్ని పేదలపై తొలగిస్తున్నాం. పేదల రుణాలు మాఫీచేస్తున్నాం, రిజిస్ట్రేషన్‌ కూడా ఉచితం. ఓటీఎస్‌ పథకం ద్వారా అన్నిరకాలుగా సంపూర్ణహక్కులు వస్తాయి. అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చు, అమ్ముకునే హక్కు ఉంటుంది. పేదలకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నాం. అవకాశాలను వాడుకోవాలా? లేదా? అన్నది ప్రజల ఇష్టం - సీఎం జగన్మోహన్ రెడ్డి

ఇదీ చదవండి

సీడీఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్

Last Updated : Dec 8, 2021, 4:36 PM IST

ABOUT THE AUTHOR

...view details