AP Cabinet Meeting: నేడు మంత్రివర్గ సమావేశం.. 32 అంశాలతో అజెండా - ఏపీ తాజా వార్తలు
22:38 January 20
పీఆర్సీ వేతన సవరణ, ఉద్యోగుల ఆందోళనలపై చర్చించే అవకాశం
సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. మొత్తం 32 అంశాలతో కేబినెట్ అజెండా నిర్ణయించారు. పీఆర్సీ వేతన సవరణ వ్యవహారం, ఉద్యోగుల ఆందోళనలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. కరోనా మూడో వేవ్, ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతి కట్టడి చర్యలు, కార్యాచరణ పై మంత్రివర్గం చర్చించనుంది. రైతులకు విత్తన, ఎరువుల సరఫరా కోసం ఈ-విక్రయ కార్పొరేషన్ ఏర్పాటు పై చర్చించనున్నారు. ఇంధన శాఖకు సంభందించి మరో రెండు అంశాలను చర్చించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: