మూలధన వ్యయ లక్ష్య సాధనలో ఏపీ వెనుకబాటు: కేంద్ర ఆర్థికశాఖ - andhra-pradesh-behind-in-capital-expenditure-target

18:18 November 12
అదనపు రుణాలు పొందేందుకు 7 రాష్ట్రాలకు కేంద్రం అనుమతి
మూలధన వ్యయలక్ష్యం సాధించిన రాష్ట్రాలకు అదనపు రుణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. రెండో త్రైమాసికంలో ఏడు రాష్ట్రాలు లక్ష్యం సాధించి కేంద్రం అనుమతి పొందాయి. దీంతో ఆయా రాష్ట్రాలకు ఎఫ్ఆర్‌బీఎంకు అదనంగా రూ.16,691 కోట్ల రుణానికి కేంద్రం అనుమతించింది. అదనపు రుణానికి తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్గఢ్, కేరళ రాష్ట్రాలు అర్హత పొందాయి.
మూలధనం వ్యయం లక్ష్యసాధనలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఆస్తుల సృష్టిలో వెనుకబాటుతో ఏపీ అర్హత పొందలేదని వెల్లడించింది.
ఇదీచదవండి.