ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @5PM - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

.

ప్రధాన వార్తలు @5PM
ap 5pm top news

By

Published : Apr 12, 2022, 4:59 PM IST

  • ఆరోగ్య మిత్రలకూ నగదు ప్రోత్సాహకాలు: సీఎం జగన్
    వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్య మిత్రలకూ నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బాధ్యతలు చేపట్టిన నూతన మంత్రులు..
    నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కొందరు నాయకులు నేడు సచివాలయంలో వారికి సంబంధించిన శాఖలకు బాధ్యతలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'జగన్ మంత్రివర్గం.. ఛాయ్, బిస్కెట్ కేబినెట్'
    ముఖ్యమంత్రి కేబినెట్​పై తెదేపా నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మంత్రివర్గం.. ఛాయ్, బిస్కెట్ కేబినెట్ అంటూ తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అవసరమైతే రాష్ట్ర బంద్​కు పిలుపునిస్తాం: సీపీఐ నేత రామకృష్ణ
    అధిక ధరలకు వ్యతిరేకంగా రేపు సచివాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ధరల పెరుగుదల వల్ల సామాన్యులు బతికే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వైకుంఠం-2 కంపార్టుమెంట్లను సిద్ధం చేస్తున్న తితిదే
    రెండేళ్లకుపైగా తిరుమల వైకుంఠం-2ను మూసివేసిన తితిదే.. ఎట్టకేలకు ఇప్పుడు మళ్లీ తెరవడానికి సిద్ధమైంది. ఈమేరకు తితిదే సిబ్బంది వైకుంఠం-2లోని కంపార్టుమెంట్లను శుద్ధి చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రోప్​వే ప్రమాదం సహాయక చర్యల్లో మరో మహిళ మృతి
    ఝార్ఖండ్​ త్రికూట పర్వతాల్లో జరిగిన రోప్​వే ప్రమాదం సహాయక చర్యల్లో మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఈ ఘటనలో మొత్తం ముగ్గురు మృతిచెందారు. 40 గంటల పాటు సాగిన సహాయక చర్యలు ముగిశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆత్మవిశ్వాసమే అందం'.. దివ్యాంగుల ఫ్యాషన్​ షో అదుర్స్!
    దివ్యాంగుల ఫ్యాషన్​ షో.. తమిళనాడు కోయంబత్తూర్​లో అట్టహాసంగా సాగింది. 50 మంది పారా అథ్లెట్లు, మరికొందరు మోడళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొని.. వీల్ ఛైర్ల సాయంతో ర్యాంప్ వాక్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కారు డ్రైవర్ దారుణం.. వృద్ధుడిని ఢీకొట్టి.. రోడ్డుపై ఈడ్చుకెళ్లి..
    ద్విచక్ర వాహనాన్ని కారుతో ఢీకొట్టిన ఓ వ్యక్తి.. అనంతరం తనతో గొడవకు దిగిన వృద్ధుడిని ఈడ్చుకెళ్లాడు. బిహార్​ పట్నాలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కోహ్లీకి ఆ విషయం చెప్పి.. చెన్నైని డుప్లెసిస్ దెబ్బతీస్తాడా?
    ఐపీఎల్​ 2022 సీజన్​లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. నేడు డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై, ఆర్సీబీ మధ్య మ్యాచ్​ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలను తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తల్లి కాబోతున్న కత్రినా కైఫ్.. వీడియో వైరల్​!
    బాలీవుడ్​ సీనియర్​ నటి కత్రినా కైఫ్.. తన సహ నటుడు విక్కీ కౌశల్‌ను నాలుగు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్​ అంటూ.. సోషల్​ మీడియా చర్చ జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details