ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతుల పోరాటానికి మేధావుల మద్దతు - రైతుల పోరాటానికి మేధావుల మద్దతు

అమరావతి రైతులు.. మందడంలో చేస్తున్న పోరాటానికి ఆంధ్రా మేధావుల సంఘం మద్దతు తెలిపింది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరింది.

andhra medhavula forum support to farmers
andhra medhavula forum support to farmers

By

Published : Dec 30, 2019, 10:54 AM IST

రైతుల పోరాటానికి మేధావుల మద్దతు

రాజధాని రైతుల ఆందోళనకు వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా మద్దతు లభిస్తోంది. ఆంధ్రా మేధావుల సంఘం నాయకుడు చలసాని శ్రీనివాస్ తో పాటు.. శ్రీకాకుళం, బెంగళూరు నుంచి వచ్చిన తెలుగు వారు.. రైతుల పోరాటానికి అండగా నిలిచారు. మందడంలో మహా ధర్నా శిబిరానికి వెళ్లి... రైతుల పోరాటానికి పూర్తి మద్దతు తెలిపారు. ఇతర ప్రాంతాల్లో రాజధాని డిమాండ్ లేనప్పుడు తరలించే ప్రతిపాదనలు ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల న్యాయమైన పోరాటం చేస్తున్నారని.. వారికి అందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అభివృద్ధిని వికేంద్రీకరించాలి తప్ప.. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో ఇలాంటి చర్యలు చేయడం సరికాదన్నారు.

ABOUT THE AUTHOR

...view details