దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. రాగల 48 గంటల్లో అల్పపీడనం బలపడి.. వచ్చే 4 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమకు వర్ష సూచన ఉందని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. కోస్తా తీరం వెంబడి 30 - 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, సముద్రం అలజడిగా ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించింది. రాయలసీమలో పలుచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్న ఐఎండీ.. 41-43 డిగ్రీలు అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం... నాలుగు రోజుల్లో వాయుగుండం! - ఏపీలో వర్షాలు
దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ ప్రకటించింది. రాగల 48 గంటల్లో అల్పపీడనం బలపడి.. వాయుగుండంగా మారనుందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమకు వర్ష సూచన ఉందని పేర్కొంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం... వాయుగుండంగా మారే అవకాశం