ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Anandayya Medicine: ఆనందయ్య ఔషధం తయారీకి ముమ్మర ఏర్పాట్లు! - Anandayya medicine news

కృష్ణపట్నంలో ఆనందయ్య మందు తయారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వాధికారుల సూచనతో... ఆనందయ్య బృందం ఔషధం తయారీకి సన్నాహాలు చేస్తోంది. వికేంద్రీకరణ పద్ధతి, ఆన్‌లైన్ ద్వారా నాలుగైదు రోజుల్లో ఔషధ పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు.

Anandayya
Anandayya

By

Published : Jun 1, 2021, 9:29 AM IST

Updated : Jun 1, 2021, 12:34 PM IST

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య మందు తయారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారుల సూచనతో.. ఔషధం తయారు చేయటానికి ఆనందయ్య బృందం సిద్ధమైంది. వనమూలికలు, ముడి పదార్థాల సేకరణలో బృందం నిమగ్నమైంది. పంపిణీ ప్రకటించేవరకు ఇతరులెవరూ గ్రామంలోకి రావద్దని ఆనందయ్య తెలిపారు.

తొలి ప్రాధాన్యత సర్వేపల్లి నియోజకవర్గానికేనన్న ఆనందయ్య.. పంపిణీ వేళ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని అందరినీ కోరారు. మరోవైపు.. కృష్ణపట్నం పంచాయతీ పరిధిలో 144 సెక్షన్‌ కొనసాగిస్తున్నారు. కృష్ణపట్నం, గోపాలపురం వద్ద చెక్‌పోస్టులు పెట్టడంతోపాటు.. పటిష్ట బందోబస్తు కోసం పోలీసులు పికెటింగ్ నిర్వహిస్తున్నారు.

'వికేంద్రీకరణ పద్ధతి, ఆన్‌లైన్ ద్వారా మందు పంపిణీ'

ఆనందయ్య ఔషధం పంపిణీపై జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కాకాని, ఆనందయ్య, అధికారులు పాల్గొన్నారు. మందు పంపిణీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశంలో చర్చించారు. వికేంద్రీకరణ పద్ధతి, ఆన్‌లైన్ ద్వారా నాలుగైదు రోజుల్లో మందుల పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.కొవిడ్‌ నిబంధనల ప్రకారమే ఆనందయ్య ఔషధం పంపిణీకి చర్యలు తీసుకోనున్నారు.

ఇదీ చదవండి:

విశాఖ పసికందు.. కరోనాను జయించింది!

Last Updated : Jun 1, 2021, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details