జర్నలిస్టులను కొవిడ్ వారియర్స్‌గా గుర్తించాలని కోరుతూ.. తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మృతిచెందిన జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్ల కుటుంబాలకు 50లక్షల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరోనా సోకి చికిత్స పొందుతున్న వారికి 2లక్షల రూపాయల సహాయం అందించాలన్నారు. జర్నలిస్టులందరికీ 20వేల రూపాయల తక్షణ సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
సీఎం జగన్‌కు ఎమ్మెల్యే అనగాని లేఖ - Tdp Leader Anagani news
ఏపీ ప్రభుత్వం జర్నలిస్టులను పట్టించుకోవడం లేదని తెదేపా ఎమ్మెల్యే అనగాని ఆరోపించారు. జర్నలిస్టులను కొవిడ్ వారియర్స్ గా గుర్తించాలని కోరుతూ.. సీఎంకు లేఖ రాశారు.
Anagani letter to CM Jagan