ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: పరిహారం ఇవ్వట్లేదని.. సొంత ఆటోకు నిప్పు - భస్వాపురం జలాశయం

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భస్వాపురం జలాశయ పరిధిలో.. తన భూమికి పరిహారం అందకపోవడంపై ఆగ్రహించిన ఓ నిర్వాసితుడు.. ఆదివారం మద్యాహ్నం ప్రాజెక్టు కట్టపై హల్​చల్ సృష్టించాడు. నిర్మాణ పనులను ఆపాలంటూ సొంత ఆటోపై డీజిల్ పోసి నిప్పంటించాడు.

protest
సొంత ఆటోకు నిప్పు

By

Published : Apr 12, 2021, 1:22 PM IST

తెలంగాణలోని యాదాద్రి జిల్లా భువనగిరి మండలం భస్వాపురం జలాశయంలో తన భూమికి పరిహారం ఇవ్వట్లేదని ఓ నిర్వాసితుడు వీరంగం సృష్టించాడు. భువనగిరి మండలం బి.ఎన్.తిమ్మాపూర్​కి చెందిన పిన్నం సతీశ్​కి 12 ఎకరాల భూమి ఉండగా.. అందులో తొమ్మిది ఎకరాల భూమి మరో వ్యక్తి పేరుతో నమోదైంది. దీంతో ఇటీవల ఇరువురి మధ్య ఏర్పడిన వివాదాన్ని గ్రామ పెద్దలు ఒప్పంద పత్రం రాయించి సమస్యను పరిష్కరించారు.

భూమిలో 75 శాతం పరిహారం సతీశ్​కు అందించాల్సి ఉండగా.. గత మూడు నెలలుగా వెంటనే ఖాతాలో నగదు జమ చేస్తామని అధికారులు హామీ ఇచ్చి జమ చేయలేదు. విసిగిపోయిన బాధితుడు నిర్మాణ పనులను ఆపాలంటూ సొంత ఆటోపై డీజిల్ పోసి నిప్పంటించాడు. ఆటో కొంత దగ్దం కాగా... స్థానికులు విషయం తెలుసుకుని హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి మంటలను ఆర్పివేశారు. సదరు వ్యకిని నిలువరించారు. సాయంత్రం మరోమారు బాధితుడు శరీరంపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డటంతో స్థానికులు అతన్ని రక్షించారు.

ABOUT THE AUTHOR

...view details