వర్ల పిటిషన్లో ప్రతివాదిగా చేర్చాలని వ్యాజ్యం - varla ramaia petition in high court on sec issue
ఎస్ఈసీ నియామకం, పదవీకాలంపై వర్ల రామయ్య దాఖలు చేసిన వ్యాజ్యంలో తనని ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ శ్రీకాకుళం జిల్లా వీఆర్ గూడెంకు చెందిన మాజీ సర్పంచ్ అనుబంధ పిటిషన్ వేశారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం , పదవీకాలం విషయంలో ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్, జీవోలను సవాలు చేస్తూ తెదేపా నేత వర్ల రామయ్య దాఖలు చేసిన వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకొని వాదనలు వినిపించేందుకు తావివ్వాలని శ్రీకాకుళం జిల్లా వీఆర్ గూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పద్మావతి హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేశారు. వర్ల రామయ్య దాఖలు చేయాలనుకుంటే ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయాలి తప్ప... రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదన్నారు. రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉండటంలో పూర్వ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విఫలమయ్యారన్నారు. ఆయనకు మద్దతుగా తెదేపా నేత రామయ్య రిట్ దాఖలు చేయడం సరికాదన్నారు.