ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Minor Girl Raped: పదకొండేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం.! - నేటి నేర వార్తలు

11 ఏళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో(Girl Rape in Hyderabad) జరిగింది. స్థానికంగా ఉండే ఓ మహిళతో సహజీవనం చేస్తున్న వృద్ధుడు.. ఆమె 11 ఏళ్ల మనవరాలిపై దారుణానికి ఒడిగట్టాడు బషీర్​.

Minor Girl Raped
Minor Girl Raped

By

Published : Nov 21, 2021, 4:52 PM IST

హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన(Minor Raped in ChandrayanGutta in Hyderabad) వెలుగులోకి వచ్చింది. 80 ఏళ్ల వృద్ధుడు 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. బాధితురాలు.. 80 ఏళ్ల వృద్ధుడితో వివాహేతర సంబంధం సాగిస్తున్న మహిళకి మనవరాలు.

పాతబస్తీకి చెందిన బషీర్‌(80) ఓ వృద్ధురాలితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆమె మనవరాలిపై బషీర్‌ కన్నేసి.. అత్యాచారం చేశాడు. బాలిక ప్రవర్తనలో తేడా గమనించిన బాలిక అమ్మమ్మ బషీర్‌ను నిలదీయగా.. తనకేమీ తెలియదంటూ బుకాయించాడు.

బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. వృద్ధుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని అమ్మమ్మకు, డాక్టర్లకు బాలిక చెప్పింది. దీంతో బాలిక అమ్మమ్మ అఫ్జల్‌గంజ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే బాలిక నివసించే ప్రాంతం ఛత్రినాక పీఎస్‌ పరిధిలోకి వస్తుండటంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. నిందితుడు బషీర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇదీ చూడండి:

FIRE ACCIDENT: గ్యాస్​ లీక్​.. పెన్నా సిమెంట్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

ABOUT THE AUTHOR

...view details