ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పారిశుద్ధ్య సిబ్బంది కోసం కొత్త ఏజెన్సీ నియామకానికి ఏఎంఆర్డీఏ కసరత్తు

పారిశుద్ధ్య సిబ్బంది కోసం గత ఆగస్టులో పొరుగుసేవల ఏజెన్సీ ఎలైట్​తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఏఎంఆర్డీఏ రద్దు చేసింది. ఐదు నెలల్లో కార్మికులకు ఒక్క నెల కూడా వేతనాలు చెల్లించకపోవడంతో.. వారు చలో సచివాలయం కార్యక్రమం నిర్వహించారు. దీంతో చర్యలకు దిగిన కమిషనర్ లక్ష్మీనరసింహం.. కొత్త ఏజెన్సీ నియామకానికి సిద్ధమవుతోంది.

amrda looking for tie up with new agency for sanitary workers
పారిశుద్ధ్య కార్మికుల కోసం కొత్త ఏజెన్సీ కోసం ఏఎంఆర్డీఏ కసరత్తు

By

Published : Jan 20, 2021, 3:10 AM IST

రాజధానికి చెందిన 29 గ్రామాల్లో దాదాపు 450 మంది వరకు పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తుండగా.. కొత్త పొరుగు సేవల ఏజెన్సీ నియామకానికి ఏఎంఆర్డీఏ చర్యలు చేపట్టింది. దాని ఎంపిక కోసం సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. అంచనాలు రూపొందించన అనంతరం టెండర్లు పిలిచి, ఖరారు చేయనున్నారు.

ఎలైట్‌ ఏజెన్సీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కమిషనర్‌ లక్ష్మీనరసింహం గత వారం రద్దు చేశారు. ఆగస్టులో కాంట్రాక్టు దక్కించుకున్న సదరు సంస్థ.. ఇప్పటి వరకు ఒక్క నెల కూడా కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జీతాలు చెల్లించకపోవడంపై కార్మికులు ఆందోళన చేపట్టి చలో సచివాలయం’ కార్యక్రమం నిర్వహించగా.. రూ. 2 కోట్ల బకాయి వేతనాలను ఏఎంఆర్డీఏ చెల్లించింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details