ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బెజవాడ దుర్గమ్మకు పొంగళ్లు సమర్పించిన అమరావతి మహిళలు - అమరావతి ఉద్యమంపై వార్తలు

ఎన్నో అవాంతరాల మధ్యం బెజవాడ దుర్గమ్మకు.. అమరావతి మహిళలు పొంగళ్లు సమర్పించారు. మెడలో వేసుకున్న ఆకుపచ్చ కండువాలు తీస్తేనే ఆలయంలోనికి అనుమతిస్తామని పోలీసులు అంక్షలు విధించారు. పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు మహిళలను మాత్రమే ఆలయానికి అనుమతించారు.

Amravati women who presented pongals to Bejwada durga
బెజవాడ దుర్గమ్మకు పొంగళ్లు సమర్పించిన అమరావతి మహిళలు

By

Published : Oct 9, 2020, 12:07 PM IST

బెజవాడ దుర్గమ్మకు పొంగళ్లు సమర్పించిన అమరావతి మహిళలు

అమరావతే రాజధానిగా కొనసాగేలా చూడాలని రాజధాని ప్రాంత మహిళలు బెజవాడ దుర్గమ్మను వేడుకున్నారు. ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం తదితర గ్రామాల నుంచి మహిళలు, రైతులు పొంగళ్లతో ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. జై అమరావతి అంటూ నినదిస్తూ వచ్చిన వారిని ప్రకాశం బ్యారేజి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మెడలో వేసుకున్న ఆకుపచ్చ కండువాలు తీసేసి వెళ్లాలని, లేదంటే అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత మహిళలను మాత్రమే ఆలయానికి పంపించారు.

ABOUT THE AUTHOR

...view details