అమరావతి పరిరక్షణ సమితి మహిళా ఐకాస ఆధ్వర్యంలో విజయవాడలో రాఖీ నిరసన నిర్వహించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమం జరిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి జగన్‌మోహన్ మాస్క్‌లకు రాఖీలు కట్టారు.
అన్నగా, తమ్ముడిగా ఆదుకోవాల్సిన వారే... మాట తప్పి మహిళలతో కన్నీరు పెట్టించారని విమర్శించారు. రాఖీ పండగ రోజున సందర్భంగా.. సోదరీమణుల ఆవేదన అర్థం చేసుకోవాలని కోరారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలి విజ్ఞప్తి చేశారు. కేంద్రం, రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం ప్రోత్సహిస్తోందని విమర్శించారు.