ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సోము వీర్రాజును కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు - three capitals for ap

భాజపా రాష్ట్ర నూతన అధ్యక్షుడు సోము వీర్రాజును అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు కలిశారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించాలని... అమరావతిలోనే రాజధాని ఉండేలా కృషి చేయాలని కోరారు.

Amravati  jac
Amravati jac

By

Published : Jul 29, 2020, 9:14 PM IST

రాష్ట్ర రాజధాని అమరావతిలోనే ఉండేలా కృషి చేయాలని కోరుతూ భాజపా రాష్ట్ర నూతన అధ్యక్షుడు సోము వీర్రాజును అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు కలిశారు. తమ పార్టీ తీసుకున్న నిర్ణయానికి తప్పకుండా పాటిస్తామని సమితి సభ్యులతో వీర్రాజు అన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలనే ఆకాంక్షతో కేంద్రం అనేక ప్రాజెక్టులను మంజూరు చేసిందని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు, కూలీలకు ఎలాంటి అన్యాయం జరిగినా భాజపా సహించబోదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details