ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సీఆర్​డీఏ బృహత్ ప్రణాళిక మార్పు జీవోను రద్దు చేయండి' - AMARAVATHI JAC PETITION IN HIGH COURT

రాజధానిలో పేదలకు భూ కేటాయింపులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని హైకోర్టులో అమరావతి జేఏసీ పిటీషన్ దాఖలు చేసింది. ఆర్​డీఏ బృహత్ ప్రణాళిక, నిబంధనల్లో మార్పు చేసేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఈ నెల 2న జారీ చేసిన జీవో 131ని సవాలు చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

'సీఆర్​డీఏ బృహత్ ప్రణాళిక మార్పు జీవోను రద్దు చేయండి'
'సీఆర్​డీఏ బృహత్ ప్రణాళిక మార్పు జీవోను రద్దు చేయండి'

By

Published : Apr 23, 2020, 8:07 AM IST

సీఆర్​డీఏ బృహత్ ప్రణాళిక, నిబంధనల్లో మార్పు చేసేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఈ నెల 2న జారీ చేసిన జీవో 131ని సవాలు చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాజధాని అమరావతి పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం జీవో 131ను జారీ చేసింది. అలాగే రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు ఇచ్చే కార్యక్రమం కింద, దారిద్య్ర రేఖకు దిగువనున్న వారిని అర్హులుగా ఎంపిక చేసేందుకు ఉద్దేశించిన జీవో 99ను సైతం రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. భూ సమీకరణ కింద రైతులిచ్చిన భూములను ఇళ్ల స్థలాలుగా ఇవ్వటానికి వీల్లేదన్నారు. ఆ రెండు జీవోలు అమరావతి భూ కేటాయింపు నిబంధనలు, సీఆర్​డీఏ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. వీటిని రద్దు చేయాలని కోరారు. నవులూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు, మందడం గ్రామాల పరిధిలోని ఇళ్ల స్థలాల కోసం 1251 ఎకరాల్లో లేఅవుట్ కార్యకలాపాలు చేపట్టకుండా అధికారుల్ని నిలువరించాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులు, సీఆర్​డీఏ కమిషనర్​ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఇవీ చూడండి-ఐఏఎస్​ అధికారి జాస్తి కృష్ణ కిశోర్​కి పదోన్నతి

ABOUT THE AUTHOR

...view details