అమరావతిలో రాజధాని కొనసాగించాలనే డిమాండ్‌తో మార్చిలో దిల్లీలో ఆందోళన చేయనున్నట్లు రాజకీయేతర ఐకాస ప్రకటించింది. గుంటూరులో సమావేశమైన ఐకాస నేతలు.... అమరావతి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఇటీవల దిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశామని... ఈసారి ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాను కలవనున్నట్లు తెలిపారు. దాదాపు 5 వేల మంది రైతులు, రాజధాని ప్రాంత ప్రజలతో దిల్లీ రాంలీలా మైదానంలో మూడు రోజుల పాటు ఆందోళన చేయనున్నట్లు ఐకాస నేత మల్లిఖార్జున తెలిపారు. మార్చి 15 వ తేదీన అందరూ కలిసి ప్రత్యేక రైళ్లలో దిల్లీ వెళ్తామన్నారు.
'దిల్లీలో 5 వేల మంది రాజధాని రైతులతో ఆందోళన' - three capitals for ap news
అమరావతి ఉద్యమాన్ని ఉద్ధృతం చేసే దిశగా రాజకీయేతర ఐకాస కార్యచరణను రూపొందించింది. మార్చిలో దిల్లీలోని రాంలీలా మైదానంలో 5 వేల మంది రైతులతో నిరసన తెలిపేలా ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. కొద్దిరోజుల్లోనే రాజధాని అంశాన్ని ప్రధాని మోదీతో పాటు అమిత్ షా దృష్టికి తీసుకెళుతామని సంఘ నేతలు తెలిపారు.
!['దిల్లీలో 5 వేల మంది రాజధాని రైతులతో ఆందోళన' amravati farmers ready to agitated in delhi over capital shifting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6109783-43-6109783-1581996181949.jpg)
amravati farmers ready to agitated in delhi over capital shifting