కార్తిక సోమవారాన్ని పురస్కరించుకుని రాజధాని ప్రాంతంలో రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కృష్ణాయపాలెంలో రైతులు దీక్షా శిబిరం వద్ద జై అమరావతి అక్షరాలతో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగడాలతో మానవహారం చేపట్టి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. వెంకటపాలెంలో రైతులు, మహిళలు అమరావతి వెలుగు పేరుతో కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు
కార్తిక దీపాలతో అమరావతి రైతుల నిరసన - అమరావతి రైతుల ఆందోళన వార్తలు
సోమవారం అమరావతి రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. కార్తిక సోమవారాన్ని పురస్కరించుకుని దీక్షా శిబిరం వద్ద జై అమరావతి అక్షరాలతో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
amaravati farmers protest