మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు, మహిళలు 522వ రోజు ఆందోళనలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, బోరుపాలెం, పెదపరిమి, నెక్కల్లు, మోతడక గ్రామాల్లో రైతులు, మహిళలు ఇళ్లవద్దే నిరసన కార్యక్రమం నిర్వహించారు. 522 రోజులుగా ఆందోళన చేస్తున్నా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, సీఎం జగన్‌లకు తమ విన్నపాలు తెలిపినా పట్టించుకోలేదని రైతులు వాపోయారు.
మోదీ తల్లి హీరాబెన్ చిత్రపటంతో అమరావతి రైతుల నిరసన - Amravati Latest News
మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... అమరావతి ప్రాంత రైతులు వినూత్న నిరసన తెలిపారు. ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ చిత్రపటంతో రైతులు, మహిళలు మందడంలో నిరసన తెలిపారు. ప్రధాని మోదీకి రైతుల కష్టాల గురించి వివరించాలని నినాదాలు చేశారు.
మోదీ తల్లి హీరాబెన్ చిత్ర పటంతో అమరావతి రైతుల నిరసన
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ రైతుల కష్టాలను ఆమె కుమారుడికి తెలియజేయాలని రైతులు విన్నవించారు. హీరాబెన్ చిత్రపటంతో రైతులు, మహిళలు మందడంలో నిరసన తెలిపారు.
ఇదీ చదవండీ... సోనూసూద్ ఆక్సిజన్ ప్లాంట్లు.. ఆంధ్రా నుంచే శ్రీకారం