పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ మహిళలు, రైతులు 386వ రోజు ఆందోళనలు చేశారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్ధండరాయునిపాలెం, వెంకటపాలెం, పెదపరిమిలో నిరసనలు చేపట్టారు. దీక్షా శిబిరాల వద్ద అమరావతికి మద్దతుగా వారు నినాదాలు చేశారు.
386వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ధర్నా - అమరావతి రైతుల ఆందోళన
అమరావతి రైతుల ఆందోళనలు 386వ రోజుకు చేరుకున్నాయి. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ప్రజాగాయకులు పాటలు పాడారు.
386వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ధర్నా
అమరావతి ఉద్యమానికి కువైట్ నుంచి జ్యోత్స్న లక్షా నలభై వేల రూపాయలను అందించారు. తుళ్లూరు దీక్షా శిబిరంలో ప్రజగాయకులు రమణ ఉద్యమ గీతాలను ఆలపించారు. మహిళలతోనూ పాడించారు.
ఇదీ చూడండి.చలిలోనూ.. ఆధార్ కోసం క్యూలైన్లో పడిగాపులు