తుళ్లూరు ధర్నా శిబిరంలో ద్రౌపది వస్త్రాపహరణ రూపకాన్ని ప్రదర్శించారు. అమరావతికి జరుగుతున్న అన్యాయాన్ని, తమ ఆవేదనను కళ్లకు కట్టేలా ప్రదర్శించారు. ఆనాటి ద్రౌపది మాదిరిగానే ఈనాడు అమరావతి ఆత్మాభిమానాన్ని, శీలాన్ని పాలకులు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారంటూ వస్త్రాపహరణ ఘట్టాన్ని ఆవిష్కరించారు. వస్త్రాపహరణ జరుగుతుంటే శ్రీకృష్ణుడి రూపంలో న్యాయదేవత చీర అందిస్తున్నట్లు నాటికను పదర్శించారు. చివరకు అమరావతి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయలేక విఫలమై ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే సందేశం ఇస్తూ రూపకం ముగుస్తుంది. ఇంత జరుగుతున్నా కేంద్రం ప్రేక్షక పాత్ర పోషించడాన్ని వివరిస్తూ... ధ్రుతరాష్ట్రుడి పాత్రను పొందుపరిచారు. ఈ నాటిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడం, అమరావతిని కాపాడుకోవటం తమ లక్ష్యమని రాజధాని రైతులు, మహిళలు స్పష్టం చేశారు.
అమరావతి రైతుల ఆందోళన: ఆవేదన కళ్లకు కట్టేలా ప్రదర్శన - Amravati farmers agitation latest news
రాజధాని ప్రాంతం తుళ్లూరులో మహిళలు, రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్నంగా తమ నిరసన తెలిపారు.
అమరావతి రైతుల ఆందోళన