అమరావతి రైతుల ఆందోళనలు 825వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని గ్రామాల్లో శిబిరాల వద్ద రైతులు తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. హైకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానం తీర్పు వచ్చాక కూడా ప్రభుత్వ ఇంకా మూడు రాజధానులు అని చెప్పడాన్ని తప్పుబట్టారు. రాజధాని రైతుల ప్లాట్లు రిజిస్ట్రేషన్‌కు సంబంధించి నోటీసులు జారీ చేయడాన్ని ప్రశ్నించారు. ప్లాట్లు అభివృద్ధి చేయకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని రైతులు అభిప్రాయపడ్డారు. హైకోర్టు తీర్పు మేరకు రాజధాని నిర్మాణ పనులు మొదలు పెట్టాలని రైతులు డిమాండ్ చేశారు.
825వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ఆందోళన - Amravati farmers news
అమరావతి రైతుల ఆందోళన 825వ రోజుకు చేరింది. హైకోర్టు తీర్పు మేరకు రాజధాని నిర్మాణ పనులు మొదలు పెట్టాలని రైతులు డిమాండ్ చేశారు. న్యాయస్థానం తీర్పు వచ్చాక కూడా ప్రభుత్వ ఇంకా మూడు రాజధానులు అని చెప్పడాన్ని తప్పుబట్టారు.
అమరావతి రైతుల ఆందోళన