ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని ఉద్యమాన్ని నలువైపులా విస్తరింపజేస్తాం: అమరావతి పరిరక్షణ సమితి - అమరావతి వార్తలు

దిల్లో సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న అన్నదాతలను అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు కలిశారు. రైతులను కలవడానికి వెళ్లకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుంకులు సృష్టించారని అన్నారు. దేశవ్యాప్తంగా రైతులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. అమరావతి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని దిల్లీ రైతులను కోరామని తెలిపారు. రాజధాని ఉద్యమాన్ని నలువైపులా విస్తరిస్తామన్నారు.

Amravati Conservation
అమరావతి పరిరక్షణ సమితి

By

Published : Feb 5, 2021, 5:31 PM IST

అమరావతి పరిరక్షణ సమితి

దేశవ్యాప్తంగా రైతులకు అన్యాయం జరుగుతోందని.... అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు ఆరోపించారు. దిల్లీ ఉద్యమానికి మద్దతుగా వెళ్లిన అమరావతి రైతులు.. ప్రభుత్వాలు అన్నదాతలను ఉగ్రవాదులుగా చూస్తున్నాయని మండిపడ్డారు. దిల్లీలోని రైతులను కలవడానికి వెళ్లకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుంకులు సృష్టించారని అన్నారు. అమరావతి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని దిల్లీ రైతులను కోరామని తెలిపారు. రాజధాని ఉద్యమాన్ని నలువైపులా విస్తరిస్తామని అమరావతి జేఏసీ ప్రతినిధి రాయపాటి శైలజ, యూత్ ఫర్ ఏపీ ప్రతినిధి వేదవతి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details