ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేసీఆర్ అందుకే సచివాలయానికి వెళ్లట్లేదు.. మేం వెళ్తాం : అమిత్ షా

amit shah on telangana: తెలంగాణలో తదుపరి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్​షా ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయటంపై ఉన్న ధ్యాస.. యువతకు ఉపాధి కల్పించాలన్న విషయంపై లేదని విమర్శించారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో కేసీఆర్‌ ఒక్కసారైనా సచివాలయానికి వెళ్లారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు భాజపాకు ఒక్కసారి అవకాశమివ్వాలని కోరారు.

'ఎన్నికల తర్వాత సచివాలయానికి వెళ్లే అవకాశం మాకే దక్కుతుంది'
'ఎన్నికల తర్వాత సచివాలయానికి వెళ్లే అవకాశం మాకే దక్కుతుంది'

By

Published : Jul 3, 2022, 8:08 PM IST

'ఎన్నికల తర్వాత సచివాలయానికి వెళ్లే అవకాశం మాకే దక్కుతుంది'

amit shah on telangana: ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం భాజపాదేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన భాజపా సంకల్ప సభలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను ఎలా ముఖ్యమంత్రిని చేయాలనేదే కేసీఆర్‌ ఆలోచన అని అమిత్​ షా విమర్శించారు.

ఎనిమిదేళ్లలో కేసీఆర్‌ ఒక్కసారైనా సచివాలయానికి వెళ్లారా..? అని ప్రశ్నించారు. సచివాలయానికి వెళ్తే ప్రభుత్వం పడిపోతుందని తాంత్రికుడు చెప్పాడని.. అందుకే కేసీఆర్‌ సచివాలయానికి వెళ్లడం లేదన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత సచివాలయానికి వెళ్లే అవకాశం తమకే దక్కుతుందని తెలిపారు. దేశం పురోగమిస్తుంటే.. తెలంగాణ తిరోగమిస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు భాజపాకు ఒక్కసారి అవకాశమివ్వాలని ఆయన కోరారు.

కారు స్టీరింగ్‌ ఓవైసీ చేతుల్లో..: తెలంగాణ ఉద్యమ సమయంలో తాము మద్దతిచ్చినట్లు అమిత్​ షా గుర్తు చేశారు. గతంలో తాము మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు ఎలాంటి సమస్యలు రాలేదన్నారు. హైదరాబాద్‌ విమోచన దినాన్ని కేసీఆర్‌ వ్యతిరేకించారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే తెరాస కారు స్టీరింగ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ చేతుల్లో ఉందని ఆక్షేపించారు. తెరాస నెరవేర్చని హామీలన్నీ భాజపా నెరవేరుస్తుందన్నారు. తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు ముగింపు పలుకుతామని అమిత్‌ షా స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపాదే విజయం. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అధికారంలోకి వచ్చి తీరతాం. కేటీఆర్‌ను ఎలా సీఎం చేయాలనేదే కేసీఆర్ ఆలోచన. తెలంగాణ ఉద్యమ సమయంలో మేం మద్దతిచ్చాం. గతంలో మేం 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు సమస్యలు రాలేదు. తెరాస కారు స్టీరింగ్‌.. అసదుద్దీన్‌ ఓవైసీ చేతుల్లో ఉంది. హైదరాబాద్‌ విమోచన దినాన్ని కేసీఆర్ వ్యతిరేకించారు. 8 ఏళ్లలో కేసీఆర్ ఒక్కసారైనా సచివాలయానికి వెళ్లారా? సచివాలయానికి వెళ్తే ప్రభుత్వం పడిపోతుందని తాంత్రికుడు చెప్పాడు. అందుకే కేసీఆర్‌ సచివాలయానికి వెళ్లడం లేదు. వచ్చే ఎన్నికల తర్వాత సచివాలయానికి వెళ్లే అవకాశం మాకే దక్కుతుంది. తెలంగాణ ప్రజలు ఒక్కసారి భాజపాకు అవకాశం ఇవ్వాలి.-అమిత్‌ షా, కేంద్ర హోంమంత్రి

ఇవీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details