Amit Shah met Ramoji Rao : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావును కలిశారు. రామోజీరావు జీవిత ప్రయాణం అపురూపమైనదని అమిత్ షా అన్నారు. చలనచిత్ర పరిశ్రమకు, మీడియాకు సంబంధించిన లక్షల మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని పేర్కొన్నారు. ఆయనను హైదరాబాద్‌లోని తన నివాసంలో కలవడం సంతోషంగా ఉందని ట్వీట్ ద్వారా తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్వీట్‌కు జత చేశారు.
రామోజీరావు ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్న అమిత్ షా - Amit Shah meets Ramoji Rao
Amit Shah met Ramoji Rao రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం కలిశారు. ఆయన ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమని ట్విటర్ వేదిక ద్వారా వ్యాఖ్యానించారు.
![రామోజీరావు ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్న అమిత్ షా Amit Shah met Ramoji Rao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16163603-975-16163603-1661134107738.jpg)
Amit Shah met Ramoji Rao
మునుగోడు బహిరంగ సభ అనంతరం అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలిశారు. ఎన్టీఆర్‌ను అమిత్‌షా పుష్పగుచ్ఛంతో ఆహ్వానించగా.. అమిత్‌షాకు ఎన్టీఆర్ శాలువా కప్పి సత్కరించారు. మొత్తం 45 నిమిషాల సేపు సాగిన సమావేశంలో 20 నిమిషాలు ఇద్దరూ ఏకాంతంగా చర్చించుకున్నారు. అనంతరం వీరిద్దరితో పాటు పార్టీ నాయకులు కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్, బండి సంజయ్‌లు కలిసి భోజనం చేశారు.
ఇవీ చదవండి..