hanumakonda man american women : తెలంగాణలోని హనుమకొండ జిల్లాకు చెందిన బస్వంత్ రెడ్డి, అమెరికాకు చెందిన ఆలిషా వివాహం ఘనంగా జరిగింది. ఖండాలు దాటిన వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపడంతో వీరి ప్రేమ పెళ్లిపీటలు ఎక్కింది. బస్వంత్ రెడ్డి ఉద్యోగం నిమిత్తం అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఓ ఐటీ కంపెనీలో పని చేస్తుండగా అతనికి అమెరికాకు చెందిన ఆలిషా అనే అమ్మాయి పరిచయం అయ్యింది. వారి పరిచయం ప్రేమగా మారింది.
యువతి ప్రేమను జయించిన ఆ యువకుడు... తన తల్లిదండ్రులను ఒప్పించి... వారి సమక్షంలోనే పెళ్లితో ఒక్కటయ్యారు. హనుమకొండలో జరిగిన వీరి వివాహానికి... పలువురు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. పెళ్లిలో తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తులు ధరించిన ఆలిషా... ప్రత్యేకంగా ఆకట్టుకుంది. బస్వంత్ రెడ్డిని పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆలిషా తెలిపింది.