Ambulance Theft: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ ఎమ్మార్వో ఆఫీస్ ప్రాంగణంలో పార్క్ చేసిన 108 అంబులెన్స్‌ను మంగళవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి చోరీ చేశాడు. వాహనం దొంగతనానికి గురైందని గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వాహనానికి ఉన్న జీపీఎస్ ఆధారంగా నల్లగొండ జిల్లా తిప్పర్తి సమీపంలో అంబులెన్స్ ఉందని పోలీసులు గుర్తించారు. దీంతో సమీపంలోని టోల్గేట్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అంబులెన్స్‌ను గుర్తించిన స్థానిక పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు.. దొంగతనం చేసిన వ్యక్తితో పాటు అంబులెన్స్ డ్రైవర్, సిబ్బందిపైనా కేసులు నమోదు చేశారు.
108 అంబులెన్స్ ను ఎత్తుకెళ్లిన దొంగ.. ఏం చేద్దమనుకున్నాడో - Rangareddy district latest crime news
Ambulance Theft: ద్విచక్రవాహనాలు దొంగతనం.. కారెత్తికెళ్లిన దొంగోడు.. ఇలాంటి వార్తలను చూస్తుంటాం. కాని ఓ ప్రబుద్దుడు ఏకంగా ఓ 108 అంబులెన్స్ నే చోరీ చేశాడు. దొంగతనం వృత్తి అయినప్పుడు.. ఏ వాహనం అయితే, ఏంటీ అని అనుకున్నాడేమో... కాని, పోలీసులు అలా అనుకోరుగా..!
ambulance