రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలపై సందిగ్ధం నెలకొంది. పదో తరగతిలో విద్యార్థుల గ్రేడు, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. కరోనా కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రద్దు చేశారు. అందువల్ల ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తారా..? లేక 9వ తరగతి పరీక్షా ఫలితాల ఆధారంగా గ్రేడ్ పాయింట్లు ఇస్తారా..? మరేదైనా మార్గం అనుసరిస్తారా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
సెప్టెంబరులో ఇంజినీరింగ్ పరీక్షలు
ట్రిపుల్ఐటీల్లో తొలుత ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం, తర్వాత పీయూసీ-2 విద్యార్థులకు తుది పరీక్షలు నిర్వహించనున్నట్లు నూజివీడు ట్రిపుల్ఐటీ ఇన్‌ఛార్జి డైరెక్టర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు తెలిపారు. యూజీసీ ఆదేశాల మేరకు సెప్టెంబరు లోపు పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఆన్‌లైన్‌లోనా.. లేక మామూలుగా నిర్వహించాలా..? అనే దానిపై స్పష్టత రాలేదని చెప్పారు. పీయూసీ - 1, ఈ-1, ఈ-2, ఈ-3 విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నమని పేర్కొన్నారు.
ఇదీ చూడండి..
'గోదావరి బోర్డును తప్పుదోవ పట్టిస్తున్నారు'