ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అంబేడ్కర్ విదేశీ విద్యాపథకం నిధుల కోసం ఎదురు చూపులు... - అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం నిధుల తాజా వార్త

అంబేడ్కర్ విదేశీ విద్యాపథకం అగమ్యగోచరంగా మారింది. మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో అనేక కోర్సుల్లో చదువుకునే అవకాశం కల్పించిన ఈ పథకానికి ప్రస్తుతం నిధులు నిలిచిపోయాయి. దీంతో విదేశాల్లో ఉన్న విద్యార్థులతోపాటు.... వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిధులు వెంటనే మంజూరు చేయాలంటూ... విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.

Ambedkar Foreign Education Funds
విడుదల కానీ అంబేడ్కర్ విదేశీ విద్యాపథకం నిధులు

By

Published : Dec 30, 2020, 10:22 PM IST

బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో పాటు.... మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్లేందుకు అప్పటి ప్రభుత్వం 2016లో అంబేడ్కర్ విదేశీ విద్యా పథకానికి నాంది పలికింది. ఈ పథకం కింద అప్పట్లో ఒక్కో విద్యార్థికి 10 లక్షల రూపాయలు ఇవ్వగా.... 2018 నుంచి మరో 5 లక్షల రూపాయలను పెంచింది. గుంటూరు జిల్లాలో 2016-17లో 9 మంది, 2017-18లో 46 మంది ఈ పథకం కింద ఎంపికయ్యారు. 2018-19 సంవత్సరంలో 50 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో రెండో విడతగా డబ్బులు 37 మందికి రాగా... మూడో విడత వాటా ఒక్కరికీ రాలేదు. 2019-2020 సంవత్సరంలో 28 మంది విదేశ విద్యా పథకానికి ఎంపిక కాగా... వీరిలో కేవలం ఆరుగురికి మాత్రమే... మొదటి విడత డబ్బు జమయింది. మిగతా రెండు విడతలు రావాల్సినవారు 22 మంది ఉన్నారు. ఇలా అనేక విడతల్లో మొత్తం 78 మందికి 7.10 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది.

తల్లిదండ్రుల ఆవేదన...

ఫీజులు కట్టలేక.... భోజన, వసతి సదుపాయాలకు విదేశాల్లో ఉన్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొవిడ్ వ్యాప్తి వారిని భయపెడుతోంది. తమ పిల్లలు ఎలా ఉన్నారో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ అవకాశం కల్పించకపోతే... తమ పిల్లలను విదేశాలకే పంపించేవాళ్లం కాదని... ఇప్పటికైనా ప్రభుత్వం నిధులను విడుదల చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

అధికారుల వివరణ...

ఈ పథకం కింద వచ్చే నిధులు ఇంకా మంజూరు కాలేదని మైనార్టీ సంక్షేమ కార్యాలయ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని... త్వరలో నిధులు విడుదలయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా పెండింగ్‌ బకాయిలను విడుదల చేసి ఆదుకోవాలని...... పిల్లల భవిష్యత్తును పరిరక్షించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

విడుదల కానీ అంబేడ్కర్ విదేశీ విద్యాపథకం నిధులు

ఇదీ చదవండీ...ఆరోగ్యశ్రీ పరిధిని మరింత విస్తరిస్తూ ఉత్తర్వులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details