ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అమరావతిపై చంద్రబాబు రౌండ్​టేబుల్ హాస్యాస్పదం' - ambati rambabu fires on chandrababu news

ప్రభుత్వంపై బురద జల్లేందుకే ప్రతిపక్షనేత చంద్రబాబు రౌండ్​టేబుల్ సమావేశం పెట్టారని... వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు.

ambati-rambabu-fires-on-chandrababu
అంబటి రాంబాబు

By

Published : Dec 5, 2019, 8:09 PM IST

రాజధాని అమరావతి గురించి ప్రతిపక్షనేత చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడంపై వైకాపా మండిపడింది. ప్రభుత్వంపై బురదజల్లేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. అధికారంలో ఉండగా రాజధానిపై ఏనాడూ అఖిలపక్షం ఏర్పాటు చేయని చంద్రబాబు.. ఇప్పుడు రౌండ్​టేబుల్ సమావేశం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ విచారణలో తెదేపా నేతల అక్రమాలు బయటపడతాయనే భయంతోనే ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ ఆదాయం పక్కరాష్ట్రాలకు వెళ్తుందని చంద్రబాబు అనడం దురదృష్టకరమన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిట్టలదొర లాగా మాట్లాడుతున్నారని.. ఆయన మాటలకు రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం దిల్లీ పర్యటనలో ఎలాంటి రహస్యం లేదని.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలుస్తున్నారని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details