పంచాయతీ ఎన్నికల్లో చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా వ్యవహరించే అధికారులను మాత్రమే బ్లాక్ లిస్టులో పెడతామని చెప్పినట్లు వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. దీనిపైనే పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు. మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్ఈసీ ఆంక్షలు సరికాదని అంబటి అన్నారు. ఎస్ఈసీ విధులు సరిగా నిర్వహిస్తేనే ఉద్యోగులకు రక్షణ ఉంటుందన్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ కూడా చట్టానికి లోబడే పని చేయాలని.. గీత దాటితే ఆయనకూ రాజ్యాంగ రక్షణ ఉండదని పేర్కొన్నారు.
'మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్ఈసీ ఆంక్షలు సరికాదు'
మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్ఈసీ ఆంక్షలు సరికాదని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. చట్టవిరుద్ధంగా పనిచేసేవారినే బ్లాక్ లిస్ట్‌లో పెడతామన్నామని స్పష్టం చేశారు.
ambati rambabu
ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వంతో చర్చించాకే ఎస్ఈసీ చర్యలు ఉంటాయని.. ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోందన్నారు. సెక్యూరిటీ ధ్రువపత్రం లేకుండా ఎస్ఈసీ ఈ-వాచ్ యాప్ ఎలా విడుదల చేస్తుందని అంబటి ప్రశ్నించారు.
ఇదీ చదవండి: 'ఎన్నికల అధికారులపై చర్యలకు ఎస్ఈసీ అనుమతి తప్పనిసరి'