ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 30, 2021, 3:10 PM IST

ETV Bharat / city

'సంక్షేమ పథకాల అమలు కోసమే అప్పులు'

సంక్షేమ పథకాల అమలు కోసమే ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు.

Ambati
అంబటి రాంబాబు

కరోనా రాకతో వచ్చిన సంక్షోభ పరిస్ధితుల్లో సంక్షేమ పథకాల అమలు కోసమే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందని వైకాపా స్పష్టం చేసింది. అప్పు చేసే ప్రతి పైసాను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తెదేపా హయాంలోమాదిరిగా అప్పులు చేసి వాటిని కాంట్రాక్టర్ల జేబులు నింపలేదని.. ఈ విషయంపై అసత్య ఆరోపణలు చేయడం తగదని అన్నారు. 2014 - 19 మధ్య కాలంలో చంద్రబాబు 132.31 శాతం అప్పులు చేశారని... అప్పడు ఏమీ మాట్లాడని వాళ్లు... ఇప్పుడు విమర్శించడం తగదని అన్నారు.

'ఆ ఇద్దరితో తెదేపా మనుగడ కష్టం'

ప్రత్యేక హోదా కోసం వైకాపా ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉంటుందని అంబటి స్పష్టం చేశారు. హోదా అనే పదాన్ని ఉచ్ఛరించే నైతిక హక్కు కూడా చంద్రబాబుకు లేదన్నారు. భాజపాతో ఐదేళ్లపాటు పాలించిన చంద్రబాబు అప్పట్లో ప్యాకేజీ తీసుకుని... ప్రత్యేక హోదా డిమాండ్​ను నిట్టనిలువునా ముంచారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేశ్​లతో పార్టీ మనుగడ కష్టం అని తెదేపా నేతలే నిర్ణయానికి వచ్చారని... జూనియర్ ఎన్టీఆర్ లాంటి వారు ఎవరో వస్తే తప్ప పార్టీ ఉండదనే నిర్ణయంలో వారున్నరని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:

'మీకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసి ఎంతో విచారం చెందాను'

ABOUT THE AUTHOR

...view details