ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ANTS NEST: చెట్లపై చీమల గూళ్లు.. ఎప్పుడైనా చూసారా..??

Ant Nests in Nirmal: పిచ్చుకలు గూళ్లు పెడతాయి..! చీమలు పుట్టలు పెడతాయి..! చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఆవాసాలుగా మారతాయి..!! అని కదా మనకిప్పటి వరకూ తెలుసు. కానీ.. ఇందుకు కాస్త భిన్నంగా చీమలు చెట్లపై గూళ్లు కట్టుకుంటున్నాయి. నిజమా..!! ఎక్కడా..?? అని ఆశ్చర్యపోతున్నారా.?? ఇంక ఆలస్యమెందుకు అదెక్కడో మీరే చూడండి.

ANTS NEST
ANTS NEST

By

Published : Mar 25, 2022, 5:43 PM IST

చెట్లపై చీమల గూళ్లు.. ఎప్పుడైనా చూసారా..??

Ant Nests in Nirmal: చెట్లమీద గూళ్లు అనగానే ఏవో పక్షులు అల్లి ఉంటాయని భావిస్తాం. కానీ ఈ చీమలు ఆకులనే ఆవాసంగా చేసుకొని గూళ్లు కట్టుకుని అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తున్నాయి. ఈ అబ్బురపరిచే దృశ్యాలు తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో కనిపించాయి.

వర్షాలు, గాలులకు చెక్కుచెదరవు..

చీమలు పుట్టలు పెడతాయని అందరికీ తెలుసు. కానీ చెట్లపై నివసించే కోగుల రకం చీమలు (ఈకోపిలా జాతికి చెందినవి) మాత్రం గూళ్లు కట్టుకుంటాయి. ఇవి తాము విసర్జించే జిగట లాంటి రసాయనంతో ఆకులను దగ్గరగా చేర్చి అతికిస్తూ గూడుగా మలుస్తాయని నిర్మల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర అధ్యాపకుడు మహ్మద్ ఖలీమ్ తెలిపారు. ఆ గూళ్లు వర్షాలు, ఎండ, గాలులకు కూడా చెక్కుచెదరవని, వాటిలో రాణీ చీమలు నివాసం ఉండి.. సంతానాన్ని వృద్ధి చేస్తాయని ఆయన చెప్పారు. కూలీ చీమలు వాటికి కాపలా కాస్తాయని.. ఇవి తమ మనుగడ కోసం గూళ్లను ఏర్పాటు చేసుకుంటాయని వివరించారు. బాగున్నాయి కదూ ఈ చీమల గూళ్లు.

ఇదీ చదవండి:Central on Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం మరో మెలిక..

ABOUT THE AUTHOR

...view details