79వ రోజుకు అమరావతి ఆందోళనలు - అమరావతి ఆందోళనలు
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రైతులు చేస్తున్న దీక్షలు 79వ రోజుకు చేరాయి. రైతులు, మహిళలు 'జై అమరావతి' అంటూ నినాదాలు చేస్తూ దీక్షలో పాల్గొన్నారు. రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ ఇళ్ల కోసం అప్పులు చేసి డబ్బులు కట్టామని, ఇప్పుడు తమను కాదని బయట వాళ్లకు స్థలాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని రైతులు నిలదీశారు.
అమరావతి ఆందోళనలు