"ప్రధాని మోదీ గారూ... దయచేసి జోక్యం చేసుకోండి"
"ప్రధాని మోదీ గారూ... దయచేసి జోక్యం చేసుకోండి" - ఏపీలో మూడు రాజధానుల వార్తలు
రాజధాని కోసం పద్నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న అమరావతి రైతులు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రధాని శంకుస్థాపన చేసినా.... తమకు న్యాయం జరగడం లేదంటూ వెలగపూడి రైతులు పోస్టుకార్డుల ఉద్యమాన్ని ప్రారంభించారు. తమ కష్టాలను వివరిస్తూ ప్రధాని మోదీకి ఉత్తరాలు రాస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రాజధానిని అమరావతిలోనే కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.
!["ప్రధాని మోదీ గారూ... దయచేసి జోక్యం చేసుకోండి" amaravthi Farmers sent post cards to pm modi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5548268-471-5548268-1577781445467.jpg)
amaravthi Farmers sent post cards to pm modi